Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యాక్సిడెంటులో మరణించిన అభిమాని.. భౌతిక కాయాన్ని చూసి ఏడ్చేసిన తమిళ హీరో కార్తీ!

  • నివాళుల‌ర్పిస్తూ ఒక్క‌సారిగా ఏడ్చేసిన న‌టుడు
  • చ‌నిపోయిన వ్య‌క్తి కార్తీ ఫ్యాన్స్ అసోసియేష‌న్ సెక్ర‌ట‌రీ
  • రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన జీవ‌న్ కుమార్‌
సినిమా హీరోల‌కు అభిమానులు ఉండ‌టం స‌హ‌జ‌మే. వారిలో కొంత‌మంది వీరాభిమానులు ఉంటారు. వీరంతా క‌లిసి అభిమాన సంఘాలు ఏర్పాటు చేసి త‌మ హీరోల పేరు మీద మంచి ప‌నులు చేస్తుంటారు. అలాంటి అభిమానుల‌ను పొందినందుకు న‌టులు గ‌ర్వ‌ప‌డుతుంటారు. వారితో వ్య‌క్తిగ‌తంగా ప‌రిచ‌యాలు కూడా పెంచుకుంటుంటారు. త‌మిళ‌నాడులో ఇలాంటి అభిమానులు చాలా మంది ఉంటారు. ప్ర‌ముఖ న‌టుడు కార్తీ పేరు మీద కూడా అక్క‌డ చాలా అభిమాన సంఘాలు ఉన్నాయి.

అక్క‌డి తిరువ‌న్నామ‌లై కార్తీ ఫ్యాన్స్ అసోసియేష‌న్ సెక్ర‌ట‌రీ జీవ‌న్ కుమార్ రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందాడు. ఈ విష‌యం తెలిసిన కార్తీ వెంట‌నే అక్క‌డికి చేరుకున్నాడు. త‌ర్వాత ఆ అభిమానికి నివాళులు అర్పిస్తూ ఒక్క‌సారిగా ఉద్వేగానికి గుర‌య్యాడు. అక్క‌డున్న వారంద‌రినీ చూసి కన్నీళ్లు ఉబికి వస్తుండగా పెద్దగా ఏడ్చేశాడు.
karthi
fans
Tamilnadu

More Telugu News